Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔంధా నాగనాధ్ » వాతావరణం

ఔంధా నాగనాధ్ వాతావరణం

సందర్శనకు మంచి సమయంమహా రాష్ట్ర లోని లోపలి భాగాలలో కల ఔంధా పూర్తిగా వేడి ప్రదేశం. పొడిగా  ఉంటుంది. కనుక చలికాలం చివరి భాగం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు  ఈ ప్రదేశ సందర్శన అనుకూలంగా చెప్పవచ్చు.

వేసవి

ఔంధా నాగనాధ్ వాతావరణం ఎలా ఉంటుంది? వేసవి వేసవికాలమైన ఏప్రిల్, మే మరియు జూన్ నెలలలో ఔంధా నాగనాధ్ ఎంతో వేడిగాను, పొడిగాను ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరతాయి. కనీస ఉష్ణోగ్రత షుమారు 22 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటుంది. మే నెల తీవ్ర వేడి కనుక పర్యాటకులు తెలివిగా ఆ సమయంలో ఈ ప్రాంతానికి దూరంగా ఉంటారు.

వర్షాకాలం

వర్షాకాలం సాధారణంగా జూలై నుండి ఆగస్ట్ మరియు సెప్టెంబర్ చివరి వరకు ఔంధాలో వర్షాలు పడుతూనే ఉంటాయి. ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఎంతో వేడిమి తర్వాత పడే ఈ కొద్దిపాటి వర్షాలు వర్షాకాలం అంటే ఇష్టపడేవారికి ఆనందాన్ని కలిగిస్తాయి.  

చలికాలం

శీతాకాలం చలికాలంలో చలి ఒక మోస్తరుగా ఉంటుంది. ఈ కాలం షుమారు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో షుమారుగా 33 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అపుడపుడూ 17 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా పడిపోతుంది. ఈ సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండి ఔంధా పర్యటన మరింత ఆసక్తికరంగా ఉంటుంది.