Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఔంధా నాగనాధ్

ఔంధా నాగనాధ్ - ఒక సమీక్ష

7

ఔంధా నాగనాధ్ హింగోలి జిల్లాలో ఒక చిన్న పట్టణం. మహారాష్ట్రలోని మరాఠ్ వాడా క్రిందకు వస్తుంది.

ఔంధా నాగనాధ్ - మొదటి జ్యోతిర్లింగంఔంధా నాగనాధ్ భారత దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు. మొదటి జ్యోతిర్లింగం కూడాను. మహారాష్ట్రలోనే కల 5 జ్యోతిర్లింగాలలోను ఇది ఒకటి.  పాండవ సోదరులలో అగ్రజుడైన యుధిష్టురుడు శివభగవానుడి రూపంగా ఒక జ్యోతిర్లింగాన్ని వారు 14 సంవత్సరాల అరణ్య వాసంలో ఉన్నపుడు ప్రతిష్టించారని నమ్ముతారు.  ఔంధా నాగనాధ్ దేవాలయం పూర్తిగా హేమద్ పంతి శిల్ప శైలిలో ఉండి శివభగవానుడి లింగం కలిగి ఉంటుంది. ఈ దేవాలయం షుమారుగా 6,000 చ. అడుగులు వ్యాపించింది. ఈ దేవాలయంలో నంది విగ్రహం అన్ని దేవాలయాలలో వలే ముందు వైపు కాక, దేవాలయానికి వెనుక భాగంలో ఉంటుంది.  దేవాలయ చుట్టుపట్ల, అనేక ఇతర చిన్న దేవాలయాలు కూడా కలవు. అవి ఇతర జ్యోతిర్లింగాలను చూపిస్తాయి. దత్తాత్రేయ, నీలకంఠేశ్వర, దశావతార, వేదవ్యాస లింగ, మరియు గణపతి వంటి దేవుళ్ళ విగ్రహాలను కూడా చూడవచ్చు.  ఒక మతపర ప్రదేశం ఔంధా ప్రదేశాన్ని సంవత్సరంలో ఒక్క వేసవి తప్ప ఎపుడైనా చూడవచ్చు. హింగోలికి సమీపంలో కల ఈ పవిత్ర ప్రదేశం రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలనుండి తేలికగా చేరేదిలా ఉంటుంది.

మీరు కనుక హింగోలి వెళ్ళే వారైతే, ఔంధా నాగనాధ్ దేవాలయాన్ని తప్పక చూడాలి. మీ పర్యటన జాబితాలో దీనిని మొదటిదిగా పెట్టుకోండి. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి ఒక్కరికి వారిలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.    

ఇతర ఆకర్షణలు

త్రయంబకేశ్వర్  త్రయంబకేశ్వరం మహారాష్ట్రలోనే కాక దేశం లోని అందరికి పవిత్రప్రదేశం. నాసిక్ సమీపంలో కలదు. త్రయింబకేశ్వరం ఔంధా నాగనాధ్ లో వలనే దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే మార్గంలో ఉన్నవి కనుక ఒకే రోజులో దర్శించవచ్చు. ఈ త్రయంబకేశ్వరుడిని దర్శించుకొన్నవారికి మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు.

యాత్రికులు ఈ ప్రదేశంలో గల హోటళ్ళు, లాడ్జీలు వంటి వాటిలో వసతి పొందవచ్చు. దేవాలయ ట్రస్టీలు కూడా వసతి ఏర్పాట్లు చేశారు.  

గ్రిష్నేశ్వర దేవాలయం (తప్పక చూడాలి)గ్రిష్నేశ్వర లో కూడా శివుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం కలదు. గ్రిష్నేశ్వర ఔరంగాబాద్ సమీపంలోని ప్రసిద్ధి గాంచిన ఎల్లోరా గుహల వద్ద కలదు.

అహల్యాబాయ్ చే నిర్మించబడిన ఈ పురాతన క్షేత్రం ఎంతోమంది భక్తులను ఏటా ఆకర్షిస్తుంది. దీనిని ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 400 సంవత్సరాల క్రిందట సుమారు 16 వ శతాబ్దంలో పునరుద్ధరించారు.  

ఔంధా నాగనాధ్ నుండి ఈ జ్యోతిర్లింగాన్ని తేలికగా చేరి దర్శించుకోవచ్చు. రోడ్డు ప్రయాణం సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది.

ఔంధా నాగనాధ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఔంధా నాగనాధ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఔంధా నాగనాధ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఔంధా నాగనాధ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఔంధా నాగనాధ్ మరియు ముంబైల మధ్య దూరం సుమారు 580 కి.మీ.లు మాత్రమే. ఔరంగాబాద్ కు 200 కి.మీ.లు మరియు నాగపూర్ కు 360 కి.మీ.ల దూరంలో ఔంధా కలదు. ఈ ప్రధాన నగరాలనుండి ఔంధా నాగనాధ్ కు మహా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు చెందిన ప్రభుత్వ బస్ లు కలవు. చోండి, పర్భాని మరియు నాందేడ్ లనుండి కూడా బస్ లు నడుస్తాయి. హింగోలి పట్టణానికి అన్ని ప్రదేశాలనుండి బస్ సౌకర్యలు కలవు. అక్కడనుండి ఔంధా నాగనాధ్ అరగంట ప్రయాణ సమయం మాత్రమే.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఔంధా నాగనాధ్ చేరాలంటే, చోండి సమీప రైలు స్టేషన్. అది సుమారు 21 కి.మీ.ల దూరంలో కలదు. చోండి నుండి మహారాష్ట్రలోని అన్ని ప్రదేశాలకు రైళ్ళు కలవు. 25 కి.మీ.ల దూరంలో కల హింగోలి కూడా తేలికగా చేరవచ్చు. క్యాబ్ లు, బస్ లు తేలికగా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఔంధా నాగనాధ్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం ఔంధా నాగనాధ్ కు ఔరంగా బాద్ విమానాశ్రయం 210 కి.మీ.ల దూరంలోని సమీప విమానాశ్రయం. ఛత్రపతి శివాజి విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ముంబైలో సుమారు 580 కి.మీ. ల దూరంలో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri