రాణిపూర్, ఝారియాల్, బలంగీర్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంట గ్రామాలు. పురాతన కాలంలో పట్నాఘర్ రాణులు రాణీపూర్ లో నివాసముండగా, ఝారియాల్ ను కోటగా ఉపయోగించేవారు.
వైష్ణవమతం, శైవమతం, బౌద్ధమతం, తాంత్రిక మతం వంటి అనేక శాఖలు ఇక్కడ అభివృద్ధి చెంది ఉన్నందున ఈ ప్రాంతానికి ధార్మిక ప్రాధాన్యత ఉంది. శివారు గ్రామాల గుండా టోంగ్ జోర్ గా పిలిచే టోంగ్ నది ప్రవహిస్తుంది.
పట్నాఘర్ మరగుడ, అసురఘర్, నరిసింగ నాథ్, సైంతల పొడఘర్, బెల్ఖండి వంటి చారిత్రిక ప్రాంతాలు రాణిపూర్-జరియాల్ చుట్టూ ఉన్నాయి. దక్షిణ కోసలకు చెందిన సోమవంశి రాజులు నిర్మించిన ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి 8,9 శతాబ్దాలకు చెందినవి. చరిత్రకారుల ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్న 200 ఆలయాలు ఒక అర మైలు పొడవునా, పావు మైలు వెడల్పున విస్తరించి ఉంటాయి.
రాణిపూర్-ఝారియాల్ హైపత్రాల్ ఆలయాలుగా పిలిచే కప్పు లేని ఆలయాలకు ప్రసిద్ధి. 64 మంది యోగినులకు చెందిన అటువంటి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలోని ముత్తమయూర శైవాచార్య గగన శివ నిర్మించిన సోమేశ్వర ఆలయమ ఇక్కడి మరొక ప్రధాన ఆకర్షణ. ఒరిస్సాలో అతి ఎత్తైన ఇటుకలతో నిర్మించిన ఇంద్రలత ఆలయం కూడ ఇక్కడ ఉంది.



Click it and Unblock the Notifications