మధ్య ప్రదేశ్ లో ని వింధ్య పర్వతాల వద్ద విస్తరించబడిన ఈ పార్క్ పులులకి ఇంకా ఈ పార్క్ లో ఉన్న జీవ వైవిధ్యానికి ప్రసిద్ది. దాదాపు 400 చదరపు కిలోమీటర్ల మేరకు ఉన్న ఈ పార్క్ స్థల స్వరూపంలో ఏటవాలు గట్లు, ఎత్తుపల్లాల అడవులు ఇంకా బహిరంగ మైదానాలు ఉన్నాయి. ఈ పార్క్ లోపల ఉన్న వివిధ ప్రాంతాలు టూరిస్ట్ స్పాట్స్ గా వ్యవహరిస్తాయి. 22 రకాల కంటే ఎక్కువ క్షీరదాలు ఇంకా 250 రకాల పక్షులు ఈ నేషనల్ పార్క్ లో ఉన్నాయి.
ఈ సాంచురీ సందర్శన లో వివిధ రకాలైన జంతువులతో పాటు పులి, ఆసియా నక్క, చారల హైనా, బెంగాల్ ఫాక్స్, రాతెల్, స్లోత్ బియర్, ఆడవి పిల్లి, గ్రీ మంగూస్ మరియు చిరుతలను గమనించవచ్చు. అంతేకాకుండా, పామ్ స్క్విరెల్, దొల్, లెస్సెర్ బందికోట్ రేట్ మరియు స్మాల్ ఇండియన్ సివెట్ లు కూడా అప్పుడప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. ఏనుగు లేదా జీప్ సఫారీ ద్వారా ఈ సాన్చురీ ని సందర్శించేందుకు ఉత్తమ మార్గం. టూరిస్ట్ డిపార్టుమెంటు ని సంప్రదించి సఫారీ బుక్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications