బాన్ధవ్గర్ నుండి శివార్లలో ఈ ఘరిపురి డ్యాం ఉంది. బాంధవ్ గర్ నుండి 10 కిలో మీటర్ల దూరం లో ఈ డ్యాం ఉంది. దీని నిర్మాణం వల్ల ఇది ప్రాచుర్యం పొందింది. ఈ డ్యాం చుట్టూ పక్కల పరిసరాలు వివిధ రకాల నీటి పక్షులతో కనుల విందు గా ఉంటాయి. బ్లాకు ఐబిస్, సారస్ క్రేన్, ఎగ్రేట్, పైడ్ వాగ్ టైల్, రెడ్-వాట్ట్లేడ్ లాప్వింగ్, లెస్సెర్ అడ్జుతంట్ స్తోర్క్, ఇండియన్ పాండ్ హెరాన్ మరియు కామన్ అండ్ పైడ్ కింగ్ ఫిషర్ వంటి నీటి పక్షులని ఈ ప్రాంతం లో గమనించవచ్చు. అదునాతమైన కెమెరాలతో పక్షి ప్రేమికులు సంవత్సరం మొత్తం ఇక్కడ తచ్చాడుతారు. 20 కిలోమిటల వరకు విస్తరించిన అధ్బుతమైన డ్యాం ఇది. ఇది ప్రసిద్ది చెందిన పిక్నిక్ స్పాట్. సందర్శకులను మెప్పించే అద్భుతమైన ప్రాంతం ఇది.