బండిపూర్ లో బండిపూర్ నేషనల్ పార్క్ తప్పక సందర్శించాలి. ఈ పార్కు షుమారు 800 చ. కి.మీ. విస్తీర్ణం కలిగి పుష్కలమైన సహజ అందాల ప్రకృతి మీకు దర్శనమిస్తుంది. ఎంతో దట్టమైన అటవీ భాగాలు కనపడతాయి. 1931 సంవత్సరంలో మైసూర్ మహారాజు ఈ నేషనల్ పార్క్ ప్రారంభించారు. అప్పటిలో అది 90 చ. కి.మీ. మాత్రమే. ఈ పార్కుకు ఆ ప్రాంతంలోని ప్రధాన దేవుడైన వేణుగోపాలుడి పేరుపై వేణుగోపాల వైల్డ్ లైఫ్ పార్క్ అని 1941 లో పేరు పెట్టారు.పర్యాటకులు పార్కు అన్ని మూలల లోను కల సహజ అందాలను ఆనందించవచ్చు. ఈ పార్కుకు చుట్టుపట్ల నాగూర్, కాబిని, మోయర్ నదులున్నాయి. పార్కు అనేక జంతువులు అంటే పులులు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి ఉడుతలు, ఏనుగులు, అడవి కుక్కలు, చిరుత పులులు, అడవి ఏనుగులు, వంటి వివిధ జంతువులు కలిగి ఉంటుంది. జంతువులే కాక, కొన్ని అపురూప పక్షులు కూడా చూడవచ్చు.
పక్షులలో కొన్ని ఇక్కడకు వలసలు కూడా వస్తూంటాయి. చెకుముకి పిట్టలు, వడ్రంగి పిట్టలు, సాధారణ పక్షులు, ఎన్నో రకాలు ఈ పార్కులో చూడవచ్చు. ఈ పార్కులో అనేక వృక్షజాలం జాతులు కూడా ఉన్నాయి. అవి టెక్టోనా గ్రాండిస్, ఎంబ్లికా అఫీషినాలిత్, వెదురు చెట్లు, మొదలైనవిగా ఉంటాయి. ఈ పార్కును పర్యటకులు ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం. ల వరకు చూడవచ్చు. ప్రవేశ రుసుము రూ. 25 మన దేశస్ధులకు, రూ.150 విదేశస్ధులకు నిర్ణయించారు.



Click it and Unblock the Notifications