Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నృత్యగ్రామ్

నృత్యగ్రామ్ - రాత్రివేళ నృత్యగానాల నజరానా!

10

నృత్యగ్రామ్ పరిసరాలు ఎంతో అద్భుతంగాను, కళాత్మకంగాను ఉంటాయి. ఈ గ్రామం తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ గ్రామం బెంగుళూరు గ్రామీణ జిల్లాలో హీసర ఘట్ట గ్రామానికి సమీపంలో ఉంది. బెంగుళూరుకు షుమారు 35 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ప్రతి ఒక్కరికి ఇక్కడకు చేరేందుకు ఎంతో తేలికగా ఉంటుంది.  

ఈ గ్రామాన్ని గురించిన కొన్ని వాస్తవాలు  

ఈ గ్రామం ప్రసిద్ధ ఒడిస్సి నృత్యకారిణి ప్రతిమా బేడి చే స్ధాపించబడింది. ప్రాచీన గురుకుల సంప్రదాయ రీతిలో నృత్యాన్ని బోధించాలనే మంచి ఆలోచనతో ఆమె ఈ గ్రామాన్ని స్ధాపించింది. నృత్యగ్రామ్ లో బోధించే నాట్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆ గ్రామా సహజ అంద చందాలు ప్రత్యేకించి గ్రామ నిర్మాణంలో వాడిన నిర్మాణ వస్తువుల తయారీ వంటివి సందర్శకులు ప్రతి ఒక్కరికి మరచిపోలేని అనుభవాలుగా ఉంటాయి.

ఈ గ్రామాన్ని ప్రఖ్యాత శిల్పి గెరార్డ్ డా కున్హా రూపొందించారు. బయలు ప్రదేశాలు, అక్కడి పచ్చదనాలు, మట్టి నిర్మిత భవనాలు ఈ నృత్యగ్రామ్ కు గ్రామీణ శోభను కల్పిస్తాయి. నృత్యగ్రామ్ సందర్శించాలంటే, వసంత హబ్బ పండుగ సమయంలో దర్శించాలి. ఈ పండుగ వసంతరుతువులో ఇక్కడ జరుపుతారు. ఈ సమయంలో  ప్రపంచవ్యాప్త  కళాకారులు ఇక్కడకు వచ్చి పాల్గొని తమ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకుంటారు.

 నృత్యగ్రామ్ సందర్శించేవారికి హీసరఘట్ట రిజర్వాయర్ చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రిజర్వాయర్ డ్యాన్స్ గ్రామానికి షుమారు అయిదు కి.మీ. దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది మానవ నిర్మిత సరస్సు. షుమారు 1124 ఎకరాల విస్తీర్ణంలో 1894 లో నిర్మించారు. నృత్యగ్రామ్ ఆది మరియు సోమవారాలలో మూసివేయబడి ఉంటుంది.  

నృత్యగ్రామ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నృత్యగ్రామ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నృత్యగ్రామ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నృత్యగ్రామ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - బెంగుళూరు సిటీ నుండి నృత్యగ్రామ్ కు కర్నాటక రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధ బస్సులను ప్రతిరోజూ నడుపుతుంది. ప్రి పెయిడ్ టాక్సీలు కూడా ఈ ప్రదేశానికి లభ్యం అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - నృత్యగ్రామ్ కు రైలు స్టేషన్ లేదు. 30 కి. మీ. దూరంలో ఉన్న బెంగుళూరు సిటీ జంక్షన్ దగ్గరి రైలు స్టేషన్. దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్ కటా మరియు ముంబై పట్టణాలనుండి బెంగుళూరు మెజెస్టిక్ రైలు స్టేషన్ ద్వారా నృత్యగ్రామ్ కు అద్దె కార్లు, క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నృత్యగ్రామ్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - స్ధానిక, విదేశీ పర్యాటకులు విమాన ప్రయాణం చేయాలంటే, బెంగుళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించాలి. ఈ ప్రదేశానికి విమానాశ్రయం 30 కి.మీ. ల దూరంలో ఉంది. విదేశీ పర్యాటకులకు సైతం తేలికగా అందుబాటులో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue