Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బన్నెరఘట్ట » ఆకర్షణలు » బన్నెరఘట్ట నేషనల్ పార్కు

బన్నెరఘట్ట నేషనల్ పార్కు, బన్నెరఘట్ట

7

బన్నెరఘట్ట నేషనల్ పార్కులో ఎంతో ప్రసిద్ధి గాంచిన వన్యప్రాణులు, ఏనుగులు, చిరుతలు, లేళ్ళు, జింకలు, సాంబార్, నక్క, గుంట నక్క, ఎలుగుబంటి, అడవి పంది, ముంగిస, కొండముచ్చు,కోతి మొదలైనవి చూడవచ్చు. ఏనుగుల సవారీ, జంగిల్ సవారీ వంటివి మీకు వినోదాన్నిస్తాయి.

ఈ పార్కులో ప్రవహించే స్వర్ణముఖి ప్రవాహం కన్నుల పండువగా చూడవచ్చు. ఈ ప్రవాహం స్వర్ణముఖి కొండలనుండి వస్తుంది. ఈ కొండలు  వివిధ రకాల చెట్లను కలిగి ఉన్నాయి. మతపర భక్తులకు ఇక్కడే ఒక అందమైన దేవాలయం కలదు. దీనిని చంపక ధామ స్వామి గుడి అంటారు. దీనిలో శ్రీ మహావిష్ణువు తన భార్యలు శ్రీ దేవి భూ దేవిలతో సహా మీకు దర్శనం ఇస్తాడు.

బన్నెరఘట్ట ఒక పిక్ నిక్ ప్రదేశంగా ఎంతో ఆనందాన్నిస్తుంది. బెంగుళూరు ప్రజలే కాదు, దేశంలో ఎక్కడ ఉన్నప్పటికి వారు బన్నెరఘట్ట నేషనల్ పార్క్ అందాలు తిలకించాల్సిందే. ప్రక్రుతి ప్రియులు ఈ పార్క్ ను తప్పక సందర్శించాలి. ఈ  పార్క్ సుమారు 104 చ. కి.మీ.టర్ల విస్తీర్ణం ఉంది. అనేక జంతువులకు, పక్షులకు, మొక్కలకు నిలయంగా ఉంది. ఈ పార్కు ను 1971 లో స్ధాపించారు. అప్పటినుండి, దానిలో పులులు, సింహాలు, మొసళ్ళు రక్షణ పొందుతున్నాయి.  లేడి, జింక, అటవి పంది, ఏనుగులు, ఎలుగుబంటులు, నక్కలు, సాంబార్, చిరుతపులి, కుందేళ్ళు, గుంటనక్కలు ఎన్నో ఈ పార్కులో మీకు కనపడతాయి.

జంతువులే కాక ఎన్నో రకాల చెట్లు అంటే, గంధపు చెట్లు, జలారి, జిజీఫస్, చింత, వేప, చుజ్జులు వంటివి కూడా ఉంటాయి. బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో ప్రధాన ఆకర్షణ అంటే స్నేక్ పార్క్. పర్యాటకులు దేశంలోనే సుమారు 7.5 ఎకరాలలో  మొదటిసారి ఏర్పడిన బటర్ ఫ్లై పార్కు కూడా చూడవచ్చు.  ఈ పార్క్ ను కర్నాటక జంతు ప్రదర్శన శాల, అగ్రికల్చరల్ సైన్స్ విశ్వవిద్యాలయం మరియు అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చి ఇకాలజీ మరియు పర్యావరణ శాఖలచే 2006 లో ఏర్పరచారు. ఈ పార్క్ లో ఒక మ్యూజియం మరియు ఆడియో విజువల్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సుమారు 20 రకాల జాతుల సీతాకోక చిలుకలకు ఈ బటర్ ఫ్లై పార్క్ నిలయంగా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue