Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బన్స్వారా » వాతావరణం

బన్స్వారా వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: సంవత్సరంలో ఆగస్ట్, మార్చ్ మధ్య సమయంలో బన్స్వారా లో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి బన్స్వారా సందర్శనకు ఇది మంచి సమయం. 

వేసవి

వాతావరణం వేసవి (మార్చ్ నుండి మే వరకు): బన్స్వారా లో 27డిగ్రీలు, 43 డిగ్రీల మధ్య వేసవి వాతావరణం ఉంటుంది. సంవత్సరంలో మే నెలలో ఎక్కువ వేడి ఉంటుంది, అందువల్ల పర్యాటకులు ఈ సమయంలో బన్స్వారా సందర్శించడానికి ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): రాజస్తాన్ లోని ఇతర ప్రాంతాల్లా కాకుండా, బన్స్వారా లో ఈ సమయంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షాల వల్ల వేసవి నుండి ఉపశమనంగా ఉంటుంది. సంవత్సరంలో జులై నెల బాగా చిత్తడిగా ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణం సాపేక్ష౦గా తేలికగా, సౌకర్యవంతంగా ఉండటంవల్ల సంవత్సరంలో ఈ సమయ౦లో బన్స్వారా సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు): బన్స్వారా లో 26 డిగ్రీలు,10 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత వల్ల చల్లని వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనకు ఇది మంచి సమయం. సంవత్సరంలో డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువ చలిగా ఉంటుంది.