Search
  • Follow NativePlanet
Share

భాగ్సు (భాగ్సునాగ్) - దేవాలయాలు, జలపాతాలు!

15

హిమాచల్ ప్రదేశ్ లోని మేక్లియాడ్ గంజ్ కి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక కేంద్రం భాగ్సు (భాగ్సునాగ్). ప్రాచీన దేవాలయాలకు, అందమైన జలపాతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ ప్రాంతం ధార్మిక ప్రాముఖ్యం వల్ల, ధర్మశాలకు దగ్గరగా ఉండడం వల్ల ఏడాది పొడవునా యాత్రీకులు ఇక్కడికి వస్తారు.

మేక్లియాడ్ గంజ్ కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగ్సు లోని పురాతన భాగ్సోనాగ్ దేవాలయం ఇక్కడి సుప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. శివుడి కోసం ఈ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయ ఆవరణలో చాలా అందమైన కొలనులు, వ్యాఘ్రముఖ కుండాలు ఉన్నాయి. వ్యాఘ్రముఖ కుండాలను హిందువులు పవిత్రమైనవిగా భావిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రాకృతిక పరిసరాలు ఈ ప్రాంత అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.

సముద్ర మట్టానికి 4342 మీటర్ల ఎత్తున ఉన్న ధవళాధర్ పర్వతశ్రేణులలో ఇంద్రహార్ పాస్ అనే ప్రముఖ పర్యాటక కేంద్రం ఉంది. చంబా, కాంగ్రా జిల్లాలకు ఈ పాస్ భౌగోళిక సరిహద్దుగా పనిచేస్తుంది. ఇక్కడికి ధర్మశాల లేదా మెక్లియాడ్ గంజ్ నుంచి పర్వతారోహణ ద్వారా చేరుకోవచ్చు. అంతేకాక ధర్మశాల నుంచి చంబా కు వెళ్ళే దారిలో వుండే మినికియాని పాస్ ను కూడా యాత్రికులు చూడవచ్చు. ఉత్తరం వైపు వుండే శిఖరాల నుంచి అందమైన పర్వతాల దృశ్యాలు చూడవచ్చు.

భాగ్సు (భాగ్సునాగ్)ను వివిధ రవాణా మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు.

భాగ్సు కి సమీపంలోని ధర్మశాల నుంచి న్యూడిల్లీ, కులు లాంటి నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతాయి. భాగ్సు నుంచి పఠాన్ కోట్ దగ్గరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి టాక్సీలు, కాబ్ ల ద్వారా భాగ్సు చేరుకోవచ్చు. మెక్లియాడ్గంజ్, దిగువ ధర్మశాల నుంచి భాగ్సు కు నిత్యం బస్సులు తిరుగుతాయి.

భాగ్సు (భాగ్సునాగ్) లో మంద్రమైన వేసవి, చల్లటి శీతాకాలాలు మధ్యస్తమైన వాతావరణం వుంటుంది. తక్కువ వాతావరణం ఉన్నప్పటికీ, శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం, ప్రత్యేకంగా ఇక్కడి మంచు కురవడం చూడాలనుకుంటే. గడ్డ కట్టే ఉష్ణోగ్రత వద్దనుకుంటే వేసవి లో వాతావరణం బాగుంటుంది కాబట్టి అప్పుడు సందర్శించడం ఉత్తమం.

భాగ్సు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భాగ్సు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భాగ్సు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భాగ్సు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా: సమీప నగరాల నుండి భాగ్సు కి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఉంటాయి. పర్యాటకులు మేక్లోడ్గంజ్ నుండి కూడా బస్సులలో భాగ్సు ను తేలికగా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం నుండి ఎంతో దూరం లేని దిగువ ధర్మశాల వరకు వెళ్ళడానికి బస్సులను కూడా ఎంచుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా: పఠాన్ కోట్, భాగ్సు కి సమీప రైల్వే స్టేషన్. భారతదేశ రాజధాని నగరమైన న్యూ డిల్లీ నుండి పఠాన్ కోట్ కు తరచుగా రైళ్ళు ఉంటాయి. రైల్వే స్టేషన్ బైటవైపు నుండి పర్యాటకులు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి బస్సులు, టాక్సీలు లేదా కాబ్స్ అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా పర్యాటకులు భాగ్సు కి చేరుకోవచ్చు. వాయుమార్గం: గగ్గల్ విమానాశ్రయంగా పిలువబడే ధర్మశాల లోని విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో ఉంటుంది. భారతదేశం లోని ప్రధాన నగరాలైన న్యూ డిల్లీ, కుల్లు వంటి ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి. డిల్లీ లోని విమానాశ్రయం భాగ్సు కి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. విమానాశ్రయం నుండి ఇక్కడికి పర్యాటకులు అద్దె టాక్సీలలో, కాబ్స్ లలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat