భు౦టార్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వున్న దయర్ గ్రామంలో విష్ణువు కోసం నిర్మించిన త్రియుగ్ నారాయణ దేవాలయం వుంది. పగోడా శైలిలో నిర్మించిన ఈ గుడిని క్రీ.శ.800 లో నిర్మించారని అంటారు. ఈ గుడిలో నాలుగు అడుగుల విష్ణువు విగ్రహం వుంది, దాంతో పాటు కొన్ని చిన్న బుద్ధుడి లోహ విగ్రహాలు కూడా వున్నాయి.