బీజపూర్ దర్శించే పర్యాటకులు మిఠారి మరియు అసర్ మహల్ తప్పక చూడాలి. ఇవి ఎంతో అందమైన భవనాలు, ఇవి బీజపూర్ లో కలవు. వీటిని 1640లో మహమ్మద్ అదిల్ షా నిర్మించారు. ఈ చారిత్రాత్మక భవనాలు పర్షియన్ శైలిలో అలంకరింబడ్డాయి. దీనిని హాల్ ఆఫ్ జస్టిస్ అని ముగల్ కాలంలో అనేవారు.
ఈ హాలులో ఒక పండుగ చేస్తారు. అపుడు దానిలోకి మహిళలను అనుమతించరు. నాలుగు స్తంభాలపై కట్టిన ఈ భవనం లో ముస్లింలు ప్రార్ధన చేస్తారు. అందమైన గదులు, పెయింటింగ్ అంకరణలు లోపల కనపడతాయి. దీనిలో మూడు ట్యాంకులు కలవు. ఒకటి 15 అడుగుల లోతు ఉంటుంది. మిగిలినవి చిన్నవి. గదిలో పర్షియా శిల్పశైలి కనపడుతుంది. ప్రతి సంవత్సరం ఉర్స్ పండుగ ఇక్కడ చేస్తారు.
అసర్ భవనంలోకి అడుగిడిన పర్యాటకులు ఇస్లాం ముందు కాలం నాటి బీజపూర్ నగర వైభవ శిధిలాలను చూస్తారు. లోపల రాళ్ళపై కొన్ని శాసనాలు కనపడతాయి. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం సమీపంలోని జుమ్మా మసీదుకు వచ్చే యాత్రికులను అధికంగా ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications