బిండు రోడ్డు గురించి చెప్పినవారు బిండు ఆనకట్ట గురించి కూడా చెప్తారు. ఈ డామ్ జల్ధక నది పై ఉంది. రబ్బరు తోటలు, అందంగా తయారుచేయబడిన ఈ ప్రదేశం, చాయాచిత్రగ్రాహకులకు ప్రయోగం కోసం ఎన్నో దృశ్యాలను అందిస్తుంది.
బిండు నుండి భూటాన్ వెళ్ళే మార్గంలో ఉంటే, ముందుకు వెళ్ళే ముందు ప్రశాంతత కోసం కొన్ని నిముషాలు ఆగడం మర్చిపోవద్దు. బిండు లో శీతాకాలంలో మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శిఖరాలు కళ్ళు చెదిరేలా చేస్తాయి. ఈ పర్వతాలే కాకుండా, శీతాకాలంలో మాత్రమె కనిపించే అనేక ఇతర ఆశ్చర్యపరిచే సుందర దృశ్యాలు కూడా ఉన్నాయి. జల్ధక హైడల్ ప్రాజెక్ట్ బిండు డాం నుండి నీటిని సరఫరా చేసుకుంటుంది.