గ్రామ యాత్ర మిమ్మల్ని చంబల్ అభాయారన్యానికి సమీపంలోని గ్రామాలకు తీసుకువెళుతుంది. ఈ గ్రామాలు మీరు గ్రామీణ భారతదేశం లో ప్రజల జీవితం లోకి ఒక అంతర్దృష్టిని అందిస్తుంది. గ్రామాల గుండా నడిచి వెళుతున్నపుడు మీరు కుండలు తయారుచేసే కుమ్మరులను (మట్టితో కుండలు), ఖుల్లర్లు (మట్టి కప్పులు), అనేక సంప్రదాయ వస్తువులు తయారుచేసే వాళ్ళను చూడవచ్చు. మీరు బూట్లు రిపేర్ చేసే కొబ్లర్ లను, అనేక ఇతర లెదర్ వస్తువులను కూడా చూడవచ్చు. ఇక్కడి దుకాణాలు జిగటగా ఉండే వివిధ రకాల స్వీట్లు మొదలైనవి అమ్ముతాయి.
గ్రామా సఫారీ మీకు ఈ అభయారణ్యం లో ఉన్న కొన్ని అందమైన మార్గాలను కూడా చూపిస్తుంది. ఈ మార్గంలో మీరు అనేక పక్షులను, జంతువులను చూడవచ్చు.
మీరు ఇక్కడి స్థానికుల సంప్రదాయాలను, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. జీవితం చాలా నెమ్మదిగా కదులుతూ వుండి, ప్రతి వారికీ పక్క వారి గురించి తెలిసి వుంటుంది. స్థానికులు చాలా సహ్రుదయులుగా వుంటారు, ఓపిగ్గా మన ప్రశ్నలకు జవాబులిస్తారు.



Click it and Unblock the Notifications