చండీగఢ్ లో రోజ్ గార్డెన్ 1967 వ సంవత్సరంలో మొదలైనది. అంతేకాక ఆసియా ఖండంలో అతి పెద్ద తోట అని ప్రశంసలు పొందినది. జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ గా సూచిస్తారు. ఈ 17 ఎకరాల తోట 1600 రకాల గులాబీలు, 17,000 వివిధ రకాల ఉత్పత్తి చేసే మొక్కలతో నిండిపోయినది. ఈ అందమైన తోటలో గులాబీలు మాత్రమే కాకుండా బహేరా,కర్పూరం, బెల్, హారర్ మరియు పసుపు గుల్మొహర్ వంటి ఔషధ విలువలు కలిగిన అనేక మొక్కలు ఉన్నాయి.
బాగా సంరక్షించిన ఈ రోజ్ గార్డెన్ ప్రతి సంవత్సరం రోజ్ ఫెస్టివల్ కు ఆతిధ్యం ఇస్తుంది. ఈ ఈవెంట్ సమయంలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు మరియు పోటీలు నగరంను సందర్శించే స్థానికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తాయి. రోజ్ గార్డెన్ యొక్క ఆకర్షించే దృశ్యాలు అద్భుతంగానూ,మనోహరంగానూ ఉంటాయి. రాక్ గార్డెన్ సుఖన సరస్సు సమీపంలో ఉంది. ఇక్కడకు ప్రతి రోజు కనీసం 5,000 సందర్శకులు వస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications