చిరపుంజీ సమీపంలో నోహ్కలికై జలపాతం భారతదేశంలో ఎత్తైన జలపాతంగా ఉంది. చిరపుంజీ ప్రతి సంవత్సరం భారీ వర్షపాతం కోసం ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతాలు ప్రధానంగా ఈ వర్షం వల్ల ఏర్పడతాయి. అందువల్ల ఎండా కాలంలో గణనీయముగా ఆరిపోతాయి. మరల డిసెంబర్,ఫిబ్రవరి మధ్య జలపాతాలు తయారుఅవుతాయి. జలపాతం క్రింద అందమైన ఆకుపచ్చ రంగు నీటితో పూర్తిగా మునుగుట కొరకు కొలను ఏర్పాటు చేసింది.
ఒక స్థానిక ఇతిహాసం ప్రకారం నోహ్కలికై పక్కన శిఖరంపై పెరిగిన కా లికై అనే అమ్మాయి పేరు నుండి ఈ జలపాతంనకు ఆ పేరు వచ్చెను. గతంలో నోహ్కలికై జలపాతంను సుదూర దృక్కోణం నుండి వీక్షించేవారు. కానీ ఇటీవల జలపాతంను చూడటానికి దిగువన కొన్ని మెట్లను నిర్మించారు. కొన్ని వందల సంఖ్యలో ఉన్న ఈ మెట్లను స్పాండిలైటిస్, ఆస్త్మా, మొదలగు వ్యాదులు ఉన్న ప్రజలు ఎక్కటం మంచిది కాదు.
ఇక్కడ ఒక స్థానిక ఖాసీ రుచికరమైన వంటల నుండి ఉత్తర మరియు దక్షిణ భారత వంటకాల వరకు ఉంటాయి. అనేక రకాల ఆహార పదార్దాలు మరియు చైనీస్ నూడుల్స్ వంటి వాటిని పొందవచ్చు. ఈ ప్రాంతం చుట్టూ వివిధ ఆహార శాలలు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చేతితో తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ఇక్కడ చిన్న దుకాణాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications