ప్రసిద్ధి చెందిన ఈ జైన దేవాలయాలు దేవ్ ఘర్ కోటకు సమీపంలో బెట్వా నది ఒడ్డున కలవు. ఈ టెంపుల్స్ సుమారు 8 మరియు 9 శతాబ్దాల నాటివిగా చెపుతారు. ఈ టెంపుల్స్ కోట లోపల, బయట కూడా కలవు. ఈ టెంపుల్ శిల్ప శైలి పురాతన భారత దేశ శిల్ప కాలాలకు నిదర్శనంగా వుంటుంది. టెంపుల్ గోడలపై అనేక మూర్తులను చెక్కారు. టెంపుల్ లను ఎర్ర ఇసుక రాతి తో నిర్మించారు.
అర్కేయోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మేరకు ఇక్కడ 31 జైన టెంపుల్స్ కలవు. హిందూ దేవాలయాలు వీటికి ముందే నిర్మించారు. ఈ దేవాలయాలను సుమారు 850 నుండి 950 ల మధ్య మరియు 950 ల నుండి 1150 ల మధ్య నిర్మించినట్లు తెలుపుతారు. జైన మతస్తులు వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశ, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు ఇక్కడకు వచ్చి పరిశోధనలు చేస్తారు.



Click it and Unblock the Notifications