Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిస్పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

డిస్పూర్ - రాజధాని నగరం! ఇది అస్సాం యొక్క రాజధాని మరియు ఇది సుమారు వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య నగరం,గౌహతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. డిస్పూర్ కన్నా ముందు అస్సాం రాజధాని షిల్లాంగ్ ఉండేది. 1973 లో, మేఘాలయ అస్సాం నుండి వేరుచేసినప్పుడు, షిల్లాంగ్ మేఘాలయ యొక్క రాజధానిగా మిగిలిపోయింది. అప్పుడు అస్సాం గవర్నమెంట్ డిస్పూర్ ను రాజధానిగా ఎంచుకున్నది. అస్సాం సెక్రెటేరియట్ మరియు అస్సాం అసెంబ్లి హౌస్ వంటి ముఖ్యమైన భవనాలు డిస్పూర్ లోనే ఉన్నాయి. ఇక్కడ శిల్పాగ్రం మరియు వశిష్ట ఆశ్రమం వంటి ముఖ్యమైన పర్యాటక స్థలాలు కూడా ఉన్నాయి. డిస్పూర్ టీ యొక్క వేలం మార్కెట్లకు ప్రసిద్ధి చెందింది. డిస్పూర్ రాజధాని నగరమైనా, గౌహతి నీడనే ఉంటున్నది. డిస్పూర్ లో ఆర్యన్, టిబెటన్ మరియు బర్మన్ వారు నివసిస్తున్నారు. వారు వారివారి సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని నమ్ముతారు. పండుగలలో బిహు పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇక్కడి ప్రాంతీయ భాష అస్సామీస్ అయిన, ఆంగ్లం మరియు హిందీ కూడా మాట్లాడుతుంటారు. డిస్పూర్ వాతావరణం డిస్పూర్ వాతావరణం గౌహతి వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఏదిఏమైనా, డిస్పూర్ సందర్శనకు నవంబర్ నెల నుండి మార్చ్ నెల వరకు అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సమయంలో వానలు తగ్గి, శీతాకాలం మొదలవుతుంది. డిస్పూర్ ఎలా చేరుకోవాలి? అస్సాంలోని ముఖ్య నగరాలకు డిస్పూర్ విమాన,రైలు, రోడ్ మార్గాల ద్వారా అనుసంధించబడి ఉన్నది. డిస్పూర్ వాతావరణం డిస్పూర్ సందర్శనకు నవంబర్ నెల నుండి మార్చ్ నెల వరకు అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సమయంలో వానలు తగ్గి, శీతాకాలం మొదలవుతుంది. రోడ్ మార్గం: అస్సాం లో అన్ని ప్రధాన నగరాలు NH 31, 37, 40 మరియు 52 ద్వారా డిస్పూర్ కు జతచేయబడి ఉన్నాయి. చిన్నచిన్న దూరప్రయాణాలకు రవాణా బస్సులు, ప్రైవేటు బస్సులు మరియు ఆటో రిక్షాలు సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయి.