Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిస్పూర్ » వాతావరణం

డిస్పూర్ వాతావరణం

డిస్పూర్ సందర్శనకు నవంబర్ నెల నుండి మార్చ్ నెల వరకు అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సమయంలో వానలు తగ్గి, శీతాకాలం మొదలవుతుంది.

వేసవి

వేసవికాలం: డిస్పూర్ లో వేసవి మార్చ్ నుండి మే నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత స్థాయిలు 22-38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేసవిలో డిస్పూర్ సందర్శిస్తే, నూలు దుస్తులు తీసుకెళ్లటం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం: ఇక్కడ వానాకాలం జూన్ నెల నుండి ప్రారంభమై సెప్టెంబర్ నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి, ఉరుములుమెరుపులతో భారీ వానలు కూడా కురుస్తాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలకన్నా తక్కువగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి మొదలై ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. శీతాకాలంలో కూడా అప్పుడప్పుడు వానలు కురుస్తాయి అందువలన ఈ సమయంలో ఉష్ణోగ్రత స్థాయి 10-25 డిగ్రీలు ఉంటుంది.