స్వరణ్ బావ్లిని గోల్డెన్ స్ప్రింగ్ అని కూడా అంటారు. ఇది ఆశాపతి శిఖరం పద భాగంలో కలదు. ఈ స్ప్రింగ్ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని హిందువుల నమ్మకం. నవరాత్రులలో చెడుపై మంచికి విజయంగా ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ నెలలలో ఉత్సవాలు జరుగుతాయి. అపుడు, అక్కడ మంచు గడ్డలు ఉన్నప్పటికీ చాలా మంది దీనిలో స్నానాలు చేస్తారు.
ఒకప్పుడు ఒక వృద్ధ మహిళా దీని నుండి నీరు తెచ్చేదని , అయితే, ఒక రాజు ఆమె కోడలు ఈ సరస్సు కు వచ్చి అందులో బంగారు ఇటుకలుచూసి ఆశ్చర్య పోయి, వాటిని తన దుప్పటతో కప్పిందని. దాని కారణంగా ఈ ఇటుకలు శాశ్వతంగా కప్పబడి పోయి నీటికి ఆమె తెల్లని దుప్పట మంచు వలే ఈ సరస్సు లో తెలుతోందని తర్వాత అమె తన సోదరులతో కలసి వచ్చి చూసి బంగారు ఇటుకలు మాయం అయినట్లు తెలుసుకొన్నదని చెపుతారు. ఈకధ మేరకు నేటికి వేసవి లో కూడా ఈ సరస్సు లో ఐస్ గడ్డాలు తేలుతూ వుంటాయి.



Click it and Unblock the Notifications