వాసుకి నాగ టెంపుల్, భాదేర్వాలో చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ చరిత్ర 11 వ శతాబ్దానికి చెందినది. వాసుకి అనే పదం సంస్కృతం నుండి వచ్చినది. వాసుకి అంటే పాము. హిందూ పురాణాల మేరకు వాసుకి నాగుల లేదా పాముల రాజు. ఈ పాము తలపై నాగమణి అనే రత్నం వుంటుంది.
ఈ టెంపుల్ లో ఒకే రాతి తో చెక్కబడిన వాసుకి నాగ విగ్రహం వుంటుంది. ప్రతి సంవత్సరం, కైలాష్ యాత్ర కు ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.