Search
  • Follow NativePlanet
Share

సర్చు - వన్ నైట్ స్టే !

12

సర్స భుం చున్ గా ప్రసిద్ది చెందినా సర్చు హిమాచల్ ప్రదేశ్ మరియు లడఖ్ మధ్యలో సరిహద్దులో నెలకొని ఉంది. సముద్ర మట్టం నుండి 4290 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి దక్షిణ వైపున బరలచ ల ఉండగా ఉత్తరం వైపున లచులుంగ్ లా ఉంది. మనాలి నుండి 475 కిలోమీటర్లు ఉన్న లెహ్ కి ప్రయాణించే దారిలో ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రమించే సదుపాయం కలదు. శీతాకాలంలో జాతీయ రహదారి మూసి ఉండడం వల్ల పర్యాటకులు సర్చుని సందర్శించలేరు. మంచు కరిగిపోయిన తరువాత మే నుండి సెప్టెంబర్ నెలలలో ఈ దారి తెరుచుకుంటుంది. ఈ సమయం లో నే లెహ్-మనాలి జాతీయరహదారిలో ఈ ప్రాంతాన్ని హాల్టింగ్ ప్లేస్ గా పర్యాటకులు ఉపయోగించుకుంటారు. ఇండియన్ ఆర్మీ కి ఆధారమైన త్సరప్ చు నది ఈ ప్రాంతానికి సమీపంలో ఉంది.

జూన్ నుండి అక్టోబర్ నెలలో ఇక్కడికి ప్రయాణించే పర్యాటకులు చిన్న కుటీరాలలో వసతిని సులభంగా పొందగలుగుతారు. భోజన వసతి కూడా కలదు. లడఖ్ లో ఉన్న జంస్కర్ ప్రాంతం పరిసరాల్లో ట్రెక్కింగ్ చేసే సదుపాయం ఉంది.

ఎండాకాలం లోనే ఈ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా పర్యాటకులకి సిఫార్సు చేయబడుతున్నది. ఎందుకంటే, ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ తో పర్యాటకులకి ఈ ప్రాంతం యొక్క అందాలని వీక్షించడానికి అనుకూలంగా ఉంటుంది. జూన్ లో ప్రారంభమై అక్టోబర్ లో ఎండాకాలం ముగుస్తుంది. అక్టోబర్ నెలలో హైవే రూట్ మరియు క్యాంపు మూసి ఉంచబడతాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రత -35 డిగ్రీల సెల్సియస్ కి పడిపోతుంది.

255 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెహ్ నుండి విమాన సౌకర్యం ద్వారా పర్యాటకులు సర్చుకి చేరుకునేందుకు అవకాశం కలదు. న్యూ ఢిల్లీ, ముంబై, చండిగర్ , త్రివండ్రుం, గోవా మరియు ముంబై వంటి ప్రధాన భారతీయ పట్టణాలకి లెహ్ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. విమానాశ్రయం వెలుపల పర్యాటకులని సర్చు కి చేర్చేందుకు షేర్డ్ టాక్సీ లు అలాగే క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. అలాగే, పర్యాటకులు రైళ్ళ ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ 581 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ రైల్వే స్టేషన్. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరాలనుకునే పర్యాటకులకు మనాలి నుండి బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి లేదా టాక్సీల ద్వారా ప్రైవేటు బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

సర్చు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సర్చు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సర్చు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సర్చు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : మనాలి అండ్ లెహ్ ప్రాంతాలకి రోడ్డు మార్గం ద్వారా సర్చు చక్కగా అనుసంధానమై ఉంది. బస్సు సర్విస్ ల పై ఆసక్తి ఉన్న పర్యాటకులు మే నుండి సెప్టెంబర్ వరకు బస్సు సేవలు ఉపయోగించుకోగలరు. అంతే కాకుండా, మనాలి నుండి లభ్యమయ్యే ప్రైవేటు రవాణా సౌకర్యాలు కూడా ఉపయోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : సరచు నుండి 581 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ రైల్వే స్టేషన్ సర్చుకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. న్యూ ఢిల్లీ, ముంబై, చండి గర్హ్, త్రివండ్రుం, గోవా, ముంబై వంటి ప్రధాన పట్టణాలకి ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికుల కోసం ప్రైవేటు అద్దె టాక్సీలు అలాగే కాబ్ సౌకర్యాలు అందుబాటులో కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం : సర్చుకి దగ్గరలో అంటే 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం లెహ్ విమానాశ్రయం. ఎయిర్ ఇండియా, కింగ్ ఫిషర్ మరియు జెట్ ఎయిర్వేస్ వంటి విమాన సంస్థల యొక్క విమాన సర్వీసులు లెహ్ లో రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. న్యూ ఢిల్లీ, ముంబై, పూణే వంటి ప్రధాన పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. వాతావరణం అనుకూలంగా లేని కొన్ని సందర్భాలలో విమానాలు ఆలస్యం లేదా రద్దు కావచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat