మనాలి నుండి 475 కిలోమీటర్లు ఉన్న లెహ్ కి ప్రయాణించే పర్యాటకులకు ప్రసిద్దమైన విరామ కేంద్రంగా సర్చు ని పేర్కొనవచ్చు. ఈ ప్రాంతం లో విరామం తీసుకునే పర్యాటకులకు గుడారాలని వసతి సదుపాయంగా అందిస్తారు అలాగే భోజన సదుపాయాలు అందుబాటులో ఉంచుతారు. భారీగా మంచు కురవడం వల్ల శీతాకాలం లో కామ్పింగ్ సైట్ ని మూసి ఉంచుతారు. అందువల్ల ఎండాకాలంలోనే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించాలి అంటే జూన్ నుండి అక్టోబర్ నెలలలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. ఈ సమయంలో వాతావరణం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. లడఖ్ లో ఉన్న జంస్కర్ ప్రాంతం పరిసరాల్లో ట్రెక్కింగ్ చేసే సదుపాయం ఉంది.