Search
  • Follow NativePlanet
Share

హేమిస్ - ప్రకృతి ఒడిలో కొద్దిసేపు !

12

జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ హేమిస్. ఇది లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో ఉంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఏంతో అనువైనది. హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా పర్యాటకులలో ప్రాచుర్యం చెందింది. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో మొదటి అవతరముచే ఈ ఆశ్రమం నిర్మించబడింది. 1672 వ సంవత్సరంలో మహాయోగ తంత్ర పాఠశాల ఆధ్యాత్మిక బోధనలు ప్రచారం చేసేందుకు రాజా సెంగె నంపర్ గారిచే పునఃస్థాపించబడినది.

ఈ హేమిస్ ఆశ్రమంలో ఉన్న ప్రధాన ఆకర్షణ బుద్ధుని తామ్ర విగ్రహం. 'కాలచక్ర', 'లార్డ్స్ అఫ్ ఫోర్ క్వార్టర్స్; కి సంబంధించిన అందమైన చిత్రలేఖనాలు ఈ ఆశ్రమ గోడలపై గమనించవచ్చు. సింహఘర్జన గురువు గా పేరొందిన టిబెటన్ బుద్ధిసం చరిత్రలో ప్రముఖ వ్యక్తి అయిన గురు పద్మసంభవ గౌరవార్ధం వేల మంది ప్రజలు జూన్/జూలై ల లో హేమిస్ లో వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు.

ఇండస్ నదీ తీరంలో ఉన్న హేమిస్ నేషనల్ పార్క్ ని మరొక ప్రసిద్దమైన ప్రధాన పర్యాటక ఆకర్షణ గా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతం హేమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ది. అంతే కాదు, భారత దేశంలో రెండవ అతి పెద్ద సంరక్షణ ప్రాంతంగా దీనిని ప్రకటించారు. 4400 చదరపు అడుగులు కలిగిన ఈ నేషనల్ పార్క్ దక్షిణ ఆసియా లో నే అతిపెద్ద నేషనల్ పార్క్. స్నో లెపర్డ్, డీర్, మకాక్స్, రెడ్ ఫొక్షెస్, వొల్వ్స్, లమెర్జియెర్ రాబందు, గోల్డెన్ ఈగల్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.

ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు రైలుమార్గం లేదా రోడ్డుమార్గాన్ని ఎంచుకోవచ్చు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే ఎండాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. హేమిస్ లో శీతాకాలం అధికమైన చలి కలిగి ఉంటుంది. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది.

హేమిస్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హేమిస్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హేమిస్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హేమిస్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో అందుబాటులో ఉన్న రెగ్యులర్ బస్సుల ద్వారా హేమిస్ కి పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. లెహ్ నుండి హేమిస్ కి చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుంది. హేమిస్ కి చేరుకోవడానికి ప్రభుత్వం నడిపే బస్సుల ద్వారా చేరుకోవడం ఉత్తమం ఎందుకంటే వీటి ధర 30 రూపాయల నుండి 50 రూపాయల లోపే ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: హేమిస్ నుండి 766 కిలోమీటర్ల దూరం లో ఉన్న శ్రీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. భారత దేశం లోని ప్రధాన పట్టణాలైన చెన్నై, న్యూ ఢిల్లీ, పూణే మరియు జమ్మూ వంటి వాటికీ చక్కగా అనుసంధానమై ఉంది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట హేమిస్ పట్టణానికి చేరుకునే బస్సు సర్వీసులు అందుబాటులో కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రధాన రవాణా మార్గాలైన వాయుమార్గం, రైలుమార్గం ఇంకా రోడ్డుమార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. వాయు మార్గం :భారత దేశంలో ని ప్రధాన పట్టణాలైన న్యూ ఢిల్లీ, శ్రీనగర్ అలాగే పూణే వంటి కొన్ని పట్టణాలకి లెహ్ విమానాశ్రయం అనుసంధానమై ఉంది. నగరం నుండి 44 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ విమానాశ్రయం నుండి హేమిస్ చేరుకోవడానికి బస్సు సర్వీసులు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat