Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేమిస్ » ఆకర్షణలు » హేమిస్ మొనాస్టరీ

హేమిస్ మొనాస్టరీ, హేమిస్

3

జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ హేమిస్. ఇది లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఏంతో అనువైనది. హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా పర్యాటకులలో ప్రాచుర్యం చెందింది. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో మొదటి అవతరముచే ఈ ఆశ్రమం నిర్మించబడింది. 1672 వ సంవత్సరంలో మహాయోగ తంత్ర పాఠశాల ఆధ్యాత్మిక బోధనలు ప్రచారం చేసేందుకు రాజా సెంగె నంపర్ గారిచే పునఃస్థాపించబడినది. ఈ హేమిస్ మొనాస్టరీ ని టిబెటన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ హేమిస్ మొనాస్టరీ లో బౌద్ధ మాట సంస్కృతీ, అలాగే జీవన విధానాలు తారసపడతాయి.

ఎన్నో మందిరాలు ఈ మొనాస్టరీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నాయి. తామ్రంతో చేయబడిన బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుని విగ్రహం వాటిలో ప్రధాన ఆకర్షణ. వరండాలోని గోడలపై ఉన్న 'కాలచక్ర', 'లార్డ్స్ అఫ్ ది ఫోర్ క్వార్టర్స్' చిత్రలేఖనాలు ఈ ఆశ్రమంలో ప్రధాన ఆకర్షణ.

దుఖంగ్, త్షోంగ్ఖాంగ్ అనే ప్రధాన విభాగాలు ఈ మొనాస్టరీ లో ఉన్నాయి. బుద్దిజం కి చెందిన దృక్ప సఖకి హేమిస్ గొంప ని నిర్వహింపబడే భాద్యత ఇవ్వబడినది. జూన్ చివర అలాగే జూలై మొదట్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు.సింహఘర్జన గురువు గా పేరొందిన టిబెటన్ బుద్ధిసం చరిత్రలో ప్రముఖ వ్యక్తి అయిన గురు పద్మసంభవ గౌరవార్ధం వేల మంది ప్రజలు జూన్/జూలై ల లో హేమిస్ లో వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat