దుర్షీత్ అనేక వృక్షాలకు, జంతువులకు నిలయం. ఈ ప్రాంతం సహ్యాద్రి కొండల శ్రేణిలో కలదు. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం వలే ఉంటుంది. పర్యాటకులకు ఇక్కడి సహజ అందాలు అచ్చెరువు కలిగిస్తాయి. మంత్ర ముగ్ధులైపోతారు. వన్య జంతువులు సహజంగా ఈ ప్రదేశంలో తిరుగాడుతూంటాయి. చెట్ల ఆకుల తాజా వాసనలు, గల గల శబ్దాలు మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. మరచిపోలేని అనుభూతులు కలిగిస్తాయి.