ఇక్కడకల వరద వినాయక దేవాలయం అతి పెద్ద ఆకర్షణ. ఈ దేవాలయం షుమారు మూడు వందల సంవత్సరాల క్రిందట క్రీ.శ. 1725 సంవత్సరంలో పేష్వా సర్దార్ రామ్ జీ మహదేవ్ వరద వినాయక బివాల్కర్ నిర్మించారు. కాలానుగుణంగా ఈ దేవాలయం కొంతమేరకు శిధిలమైంది కనుక అప్పటి ఆకర్షణ లేదు. కాని ఒకసారి మీరు చూస్తే చాలు అందమైన 25 అడుగుల ఎత్తుకల గోపురం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిలో రెండు విగ్రహాలుంటాయి. వరద వినాయక అంటే గణపతి మరో రూపం. ఎడమవైపు విగ్రహం మార్బుల్ తో చేయబడి ఉంటుంది. మరొకటి కుంకుమరంగుతో అద్దబడి ఉంటుంది. దేవాలయ ఉత్తర భాగం లో గోముఖ అంటే ఆవు నోటిని మీరు చూడవచ్చు. ఈ ఆవు నోటి ద్వారా పవిత్ర నీరు బయటకు వస్తూంటుంది. ఇక్కడే మరొక ఆకర్షణ నంద ద్వీపం. ఈ దీపం సుమారు క్రీ.శ.1892 నుండి వెలుగుతూనే ఉంది.



Click it and Unblock the Notifications