బెయ్ట్ ద్వారకా అనేది ప్రతి ఆధ్యాత్మిక భక్తుడు అభిమానించే ప్రదేశంగా భావించవచ్చు. అందమైన అరుదైన పవిత్ర స్థలాలతో ఉన్నటువంటి ఈ చిన్న ద్వీపం బెయ్ట్ సంఖోదర్ అనే మరొక పేరు కూడా పొందింది. అంతే కాక, ఇది ఒక అభివృద్ధి చెందుతున్న నౌకాశ్రయం. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని చూడవచ్చు. ఇక్కడ పిక్నిక్ లకు, కాంపింగ్లకు మరియు సముద్ర విహారానికి వెళ్ళవచ్చు. 500ఏళ్ళ క్రితం వల్లభాచార్య చే నిర్మితమైన కృష్ణ దేవాలయం, హనుమంతుని కుమారుడు మకరద్వజుని విగ్రహం ఉన్న హనుమాన్ దేవాలయం, శ్రీ రాముడి దేవాలయం అయిన కచోరియు, ప్రఖ్యాత సూఫీ సెయింట్ హాజీ కిర్మాణి పీర్ దేవాలయం మరియు గురుద్వారా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య దేవాలయాలు.