సరైన సమయం సాధారణంగా సంవత్సరం మొత్తం ఈరోడ్ లో వాతావరణం పొడిగా ఉంటుంది. అయినప్పటికీ, అక్టోబర్ నుండి మార్చ్ నెలలలో ఈరోడ్ నగర సందర్శన ఉత్తమం.
వేసవి ఈరోడ్ లో వేసవి కాలం మార్చ్ నుండి ప్రారంభమై మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుండి 34 డిగ్రీల వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా మే నెలలో నమోదవుతుంది.
వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో సరిపడని వర్షాల వల్ల ప్రజలు ఎండతీవ్రత నుండి విశ్రాంతి పొందలేరు. సంవత్సరంలో, మొత్తం వర్షపాతం 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం షుమారు వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం షుమారు 30 మిల్లీమీటర్లు. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్, నవంబర్ నెలలలో ప్రారంభమవుతాయి. నైరుతి ఋతుపవనాలు జూన్, ఆగస్ట్ నెలలో మధ్యలో వస్తాయి, ఈ సమయంలో ఈరోడ్ తాలూకాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
శీతాకాలం డిసెంబర్ నెలలో వర్షాలు ఆగిపోతాయి, ఆకాశం స్పష్టంగా ఉండి, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు) 13 డిగ్రీల నుండి 24 డిగ్రీల వరకు ఉంటుంది.