తాషి వ్యూ పాయింట్ చాలా అందమైన ప్రదేశం. గాంగ్టక్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వుండే ఈ ప్రదేశం నుంచి అందమైన కాంచేన్ జంగా పర్వత శ్రేణుల మనోహర దృశ్యం చూడవచ్చు. పర్యాటకులు ఈ అందాన్ని మరింత తీరిగ్గా ఆస్వాదించడానికి వీలుగా ఇక్కడ ఒక కేఫెటీరియా, ఒక అబ్జర్వేషన్ సెంటర్ కూడా తెరిచారు. కాంచేన్ జంగా పర్వతం అందాన్ని చూడడమే కాక, ఇక్కడ పవిత్రమైన, అందమైన ఫోడోంగ్, లబ్రాంగ్ ఆరామాలు కూడా గాంగ్టక్ నుంచి దగ్గరగా వుండే ఇక్కడి నుంచి చూడవచ్చు.
ఈ ప్రాంత పర్యటన నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? అయితే పొద్దున్నే కొంచెం ముందుగా ఇక్కడికి వెళ్లి, దృశ్యాలను ఆస్వాదించండి, అప్పుడు కొంచెం ముందుకు వెళ్లి వ్యూ పాయింట్ దగ్గర వున్న పార్క్ కు చేరుకొని ఇక్కడి కేఫెటీరియా నుంచి ఒక వేడి కప్పు కాఫీ, మొమో లు, స్నాక్స్ తో రిలాక్స్ అయ్యి, ఆనందించండి.