Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పురాతన గోవా » ఆకర్షణలు » సెయింట్ కాజేటాన్ చర్చి

సెయింట్ కాజేటాన్ చర్చి, పురాతన గోవా

1

సెయింట్ కాజేటాన్ చర్చి గోవా ప్రాంతంలో నిస్సందేహంగా లేదా వివాదాస్పదం కాని రీతిలో ఎంతో అందమైన చర్చిగా పరిగణిస్తారు. ఈ చర్చిని చూసిన వారు యూరప్ దేశాలలో వారు చూసిన ఇతర చర్చిలను తప్పక గుర్తుకు తెచ్చుకొని పోలిక చేస్తారు. దానికి కారణం ఈ చర్చిలోని కోరింధియన్ మరియు గోత్ శిల్పకళా నైపుణ్యం అని చెప్పాలి. చర్చి యొక్క తెల్లటి తెలుపు నుండి దానికి గల రెండు దీర్ఘ చతురస్ర టవర్ల వరకు ఐరోపా ఖండంలోని చర్చిల అసలు శిల్ప సంపదను గుర్తు చేస్తుంది.

సెయింట్ కాజేటాన్ చర్చిని ఇటలీలోని నేటరైట్ బ్లాక్స్ తో కట్టబడిన సెయింట్ పీటర్ చర్చి ని చూసి నిర్మాణం చేశారు.   బాగుగా పర్యటించిన పర్యాటకుడు లేదా యాత్రికుడు రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ మరియు దాని అనుబంధ చర్చిలయిన ఫోర్ట్రెస్ ఆఫ్ పౌల్ మరియు పీటర్ మరియు అదే రీతి శిల్పకళా నిపుణతలుకల  సెయింట్ కాజేటాన్ చర్చి గోవాకు పోలిక చేస్తాడు.  చర్చి లోపలి అలంకరణలుచర్చి లోపలి భాగాలు కూడా బయటివి వలెనే చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిలో కొరింధియన్ మరియు బారోక్ శిల్ప కళలు కనపడతాయి. ఎడమ వైపు అనేక పీఠాలు మరియు కుడి వైపు పెద్ద స్తంభాలతో కూడిన ప్రదేశం ఉంటాయి. ఎడమ వైపు పీఠాలపై హోలీ ఫ్యామిలీ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ పీటీ మరియు సెయింట్ క్లారే విగ్రహాలుంటాయి. కుడివైపు ప్రదేశంలో సెయింట్ కాజేటాన్, సెయింట్ జాన్ మరియు సెయింట్ ఆగ్నేస్ విగ్రహాలుంటాయి.   సెయింట్ కాజేటాన్ ను పెట్టిన పీఠం అతి పెద్దదిగా ఉండి కొయ్య నిర్మాణంతో చేయబడింది. ఈ పీఠాలపై ఇటాలియన్ పెయింటింగ్ లలో సెయింట్ కాజేటాన్ జీవితం వివిరాలుంటాయి. ఇక్కడ కల పెద్ద గోపురం చర్చి లోపలి లేదా వెలుపలి నుండి కూడా  అద్భుతం అనిపిస్తుంది.

చర్చి ఆవరణలో కల బావిచర్చి ఆవరణలో ఒక బావి ఉంటుంది. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల మేరకు ఈ ప్రదేశం ఒక పురాతన హిందు దేవాలయం అని పోర్చుగీసు పాలకుల స్వాధీనంతో అది చర్చిగా రూపొందిందని చెపుతారు. అయితే, దీనికి వ్యతిరేకంగా చెప్పేవారు మాత్రం, ఈ బావి హిందువులచే వివాదం కొరకు కావాలని తవ్వబడిందని కూడా చెపుతారు. మరి ఈ ప్రదేశంలోనే కొన్ని హిందు దేవతల చెక్కడాలు కూడా ఉండటంతో మరింత వివాదాస్పదంగానే ఈ ప్రదేశం కొనసాగుతోంది. ఒకప్పుడు చక్రవర్తి అదిల్ షా కు చెందిన ప్యాలెస్ లో ఇది మిగులు భాగం కూడాను.  అక్కడకు చేరడం ఎలా? సెయింట్ కాజేటాన్ చర్చి పురాతన గోవాలో గోవా రాజధానికి 10 కి.మీ.ల దూరంలో ప్రసిద్ధి చెందిన బసిలికా ఆఫ్ బామ్ జీసస్ మరియు సెయింట్ ఆగస్టైన్ చర్చి శిధిలాల మధ్య కలదు. ఈ చర్చిలన్ని చూడాలంటే, ఒక రోజు ఒక అద్దెకారుతో ప్రయాణించటం తేలికగా ఉంటుంది. పురాతన గోవా పట్టణానికి వాస్కోడా గామా మరియు మర్గోవాలనుండి క్యాబ్ సర్వీసులు అధికంగానే ఉంటాయి. మీరు కనుక కొద్దిపాటి సాహసాలు చేసేవారైతే, ఒక బైక్ అద్దెకు తీసుకొని అద్భుతమైన ఈ పురాతన చర్చీలను చూసి తప్పక ఆనందించండి.      

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Apr,Mon
Return On
07 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Apr,Mon
Check Out
07 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Apr,Mon
Return On
07 Apr,Tue

Near by City