ఇడుక్కి ఆర్చ్ డ్యాం, ఇడుక్కి

హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » ఇడుక్కి ఆర్చ్ డ్యాం

ప్రతి రోజు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చే ఎందరో పర్యాటకులని ఇడుక్కి ఆర్చ్ డ్యాం ఆకర్షిస్తోంది. ఆసియా లో నే మొదటి ఆర్చ్ డ్యాం కాగా ప్రపంచం లో నే రెండవ ఆర్చ్ డ్యాం గా ఇడుక్కి ఆర్చ్ డ్యాం ప్రాచుర్యం పొందింది. పెరియార్ నది పైన, కురవన్మల మరియు కురతిమల కొండల మధ్య ఈ డ్యాం అందంగా కట్టబడినది.

అయిదు నదులు, వేరే ఇతర ఇరవై డ్యాం లు, ఒక భూగర్భ విద్యుత్ జనరేటర్ మరియు భూగర్భ సోరంగాలతో ఇది ఒక జల విద్యుత్ పవర్ స్టేషన్ గా పనిచేస్తుంది. ఈ ఇడుక్కి ఆర్చ్ డ్యాం 550 అడుగుల పొడవు మరియు 650 అడుగుల వెడల్పు కలిగి ఉంది. చేరుతోని బ్యారాజి వద్ద ఉన్న ఈ డ్యాం కి సమీపంలోనే ఇడుక్కి వైల్డ్ లైఫ్ సాంచురి ఉన్నాది. ప్రపంచంలోనే రెండవ ఆర్చ్ డ్యాం గా నే కాకుండా, ఆకర్షణీయమైన పరిసరాల వల్ల సందర్శకులని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఆగష్టు నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. ఈ సమయంలో ఈ డ్యాం అద్భుతమైన జల ధారతో అందరిని అమితంగా ఆకర్షిస్తుంది.

Please Wait while comments are loading...