Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇస్లాంనగర్ » వాతావరణం

ఇస్లాంనగర్ వాతావరణం

ఉత్తమ సమయం నవంబర్, ఫిబ్రవరి మధ్య ఇస్లా౦నగర్ సందర్శనకు ఉత్తమ సమయం. ఆ సమయంలో సూర్యుని కిరణాల భరించలేని వేడి సమస్య ఉండదు కాబట్టి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే శీతాకాలం లో పురాతన పట్టణమైన ఇస్లామ్నగర సందర్శన సరైన ఎంపిక. అంతేకాకుండా, ఈ సమయంలో వర్షాలు ఉండవు కాబట్టి మీ విశ్రాంతి సమయానికి భంగం కలిగించవు. అందువల్ల, చల్లని శీతాకాల సమయంలో ఇస్లా౦నగర్ సందర్శనకు ఉత్తమ సమయం.

వేసవి

వేసవి ఇస్లాంనగర్ వేసవి సమయంలో ఉష్ణోగ్రత షుమారు 35 డిగ్రీల నుండి 40 డిగ్రీల తో భరించలేనంతగా ఉంటుంది. భరించలేని వేసవి ఉష్ణోగ్రత వల్ల, మార్చ్ నుండి మొదలై మే లో అధికంగా ఉండే వేసవి సమయంలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించరాదని సూచన.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది, ఈ నెల చివరి వరకు ఉంటుంది. వర్షాకాలం సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. భరించలేని వేసవి తరువాత తరచుగా వచ్చే వర్షాలు ప్రతివారికీ ఉపశమనంగా ఉంటుంది. జూన్, సెప్టెంబర్ మధ్య అత్యధిక వర్షపాతం ఉంటుంది. డిసెంబర్, జనవరి లో కూడా తక్కువ వర్షపాతం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ఇస్లాంనగర్ లో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. డిసెంబర్, జనవరి సమయంలో మెర్క్యూరీ తీవ్రంగా పడిపోతుంది. శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 10 నుండి 27 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇస్లా౦నగర్ సందర్శనకు శీతాకాలం సరైన సమయం.