ఇలాంగ్ పార్క్ నుండి అందమైన పైన్తోవా వాలీ చూడవచ్చు. ఈపార్క్ కు ప్రభుత్వ టూరిజం శాఖ ఎప్పటి కపుడు మరమ్మత్తులు చేసి అందంగా ఉంచుతుంది. ఈపార్క్ లో అన్ని సౌకర్యాలు ఏర్పరిచింది. ఇటీవలే ఒక ఎకో పార్క్ ను కూడా ఇక్కడ నిర్మించింది. వివిధరకాల పూవులు, వృక్షాలు, అందమైన వాలీ గుట్టలు కలవు. ఇది మేఘాలయలో ఉత్తమ పార్క్ గా చెపుతారు. నవంబర్ నుండి జూన్ నెలల మధ్య సందర్శనకు అనుకూలం. షిల్లాంగ్ నుండి టాక్సీ ల లో ఇక్కడకు చేరవచ్చు.



Click it and Unblock the Notifications