వాయు మార్గం ద్వారా: గమ్యస్థానానికి 285 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్, జైసల్మేర్ కి సమీప విమానాశ్రయం. పర్యాటకులు విమానాశ్రయం నుండి జైసల్మేర్ వెళ్ళడానికి అద్దె టాక్సీలు ఉంటాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారతదేశం లోని ప్రధాన నగరాలు కొలకత్తా, ముంబై, బెంగళూరు, చెన్నై నుండి విమానాలు నడుస్తున్నాయి.