పట్నేశ్వర్ మందిరం, జమూయి లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఒకప్పుడు గోస్వామి కుటుంబానికి నివాసంగా ఉండేదని పురాణాలూ చెప్తాయి. ఒకరోజు గోస్వామి అడవిలో ఏదో మెరుస్తున్నట్లుగా చూస్తాడు, దగ్గరగా చూసి అది శివలింగం గా గుర్తిస్తాడు. ఈ ఆలయం చివరిగా క్రీశ. 1711 లో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో, 2 అడుగుల మట్టి గోడ ఈ శివలింగం చుట్టూ ఏర్పడుతుంది, దానిపై కొన్ని లీటర్ల పాలు పోస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎన్ని పాలు పోసినా ఈ శివలింగం కరగదు. దీనిని కామ్నా లింగం అని కూడా అంటారు, ఈ ఆలయం మనోహరమైన అందానికి, సుందరమైన కియుల్ నదికి కూడా పేరుగాంచింది.



Click it and Unblock the Notifications