రంజీత్ నది తీస్తా నదికి ఉపనది, ఇది సిక్కిం లో అతిపెద్ద నది. ఇది పశ్చిమ సిక్కింలోని హిమాలయ పర్వతాల నుండి ఉద్భవించింది, జోర్థాంగ్, పెల్లింగ్, లేగ్షిప్ పట్టణాల గుండా ప్రవహిస్తుంది. ఇది ఒక జీవనది, వర్షాకాలంలో వచ్చే వర్షాల నీటిని, వేసవిలో హిమాలయాలపై కరిగే మంచు నీటిని సేకరిస్తుంది. ఈ నది నీరు అల్లకల్లోలంగా ఉండడం వల్ల రివర్ రాఫ్టింగ్ కి సరైన స్థలం, అందువల్ల తెప్పనడిపే అభిమానులలో చాలా ప్రజాదరణ పొందింది. ఈ నది జాతీయ జలవిద్యుత్ పవర్ కార్పోరేషన్ (ఎన్ హెచ్ పి సి) 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పవర్ ప్లాంట్ ను కలిగిఉంది.