Search
  • Follow NativePlanet
Share

నామ్చి – ప్రకృతి ఒడిలో విహారం!

21

గాంగ్టక్ నుండి 92 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న సుందరమైన నగరం నామ్చి సిక్కిం లో పర్యాటకులకు ప్రసిద్ధ ప్రదేశం. ఈ ప్రదేశం అందమైన లోయల విస్తరణతో మంచుతో కప్పబడిన పర్వతాలు, డార్జీలింగ్, కాలింపోంగ్ కొండల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.  భౌగోళిక స్థితి సముద్ర మట్టానికి పైన 1675 మీటర్ల ఎత్తున ఉన్న ఒక పట్టణం నామ్చి. ఈ ప్రాంతం సిక్కిం మత గురువు, ప్రపంచంలోనే ఎత్తైన పద్మసంభవ గురు విగ్రహం ఇటీవలే ప్రజాదరణ పొందింది. నామ్చి బౌద్ధ ఆరామాలకు, ఎత్తైన పర్వత శిఖరాలకు, పోలికలేని దృశ్య స్థలాలకు పేరుగాంచింది. ఈ పట్టణం సిలిగురి నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్, సిక్కిం లోని ఇతర ప్రధాన నగరాలకు కూడా దగ్గరగా ఉంది. నామ్చి అంటే భూటియ భాషలో “స్కై హై” అని అర్ధం. నామ్చి పర్యాటకుల దృష్టిలోనే కాకుండా, దాని గొప్ప చరిత్ర, అనేక రకాల పర్యాటక ఆకర్షణలు, కార్యకలాపాల వల్ల పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ది చెందింది. ఇది చాలావరకు రాష్ట్ర రాజధానిని పోలి ఉన్నప్పటికీ, గాంగ్టక్ సందడిగల పరిసరాలతో పోలిస్తే నామ్చి చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటుంది. నామ్చి దాని ఆశక్తికరమైన చరిత్ర, పూర్వపు అంతుచిక్కని కధలకు పేరుగాంచింది. జనాభా వివరాలు నామ్చి లో ఎక్కువమంది జనాభా హిందువులు, బౌద్ధులు. ఇక్కడ మాట్లాడే భాషలు నేపాలీ, ఇంగ్లీష్, హిందీ. నామ్చి లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు నామ్చి ఆశ్రమం, రోలోంగ్ ఆశ్రమం, నిద్రాణమైన అగ్నిపర్వతమైన సంద్రుప్త్సే కొండ, టెన్డోంగ్ హిల్, రాక్ గార్డెన్, దొలింగ్ గోమ్పా, న్గాడాక్ ఆశ్రమం, టేమి టీ తోట, చార్ధాం మొదలైనవి నామ్చి లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఫిబ్రవరి మాసంలో సిక్కింలోని అతిపెద్ద వార్షిక పూల ప్రదర్శన నామ్చిలో జరుగుతుంది, ఇతర పూలతోపాటు అనేక రకాల పూతోటల ప్రదర్సన కూడా జరుగుతుంది. అంతేకాకుండా, నామ్చి లోని ప్రసిద్ధ బైచుంగ్ స్టేడియం లో “గోల్డ్ కప్” ఫుట్ బాల్ టోర్నమెంట్ జరుగుతుంది, ఇది అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ స్టేడియం సిక్కి౦వాసుల ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియ గౌరవార్ధం సిక్కిం ప్రభుత్వ౦ చే నిర్మించబడింది. నామ్చి సందర్శనకు ఉత్తమ సమయం మార్చ్ నుండి జూన్ వరకు నామ్చి సందర్శనకు సరైన సమయం.నామ్చి చేరుకోవడం ఎలా నామ్చి ని వాయు, రైలు మార్గాలద్వారా చేరుకోవచ్చు.

నామ్చి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నామ్చి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నామ్చి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నామ్చి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా సిక్కిం లోని అన్ని ప్రధాన ప్రాంతాలనుండి బస్సులు (ప్రభుత్వ, ప్రైవేట్), జీపులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *నామ్చి లో రైల్వే స్టేషన్ లేదు జల్పాయిగురి వద్ద ఉన్న రైల్వే స్టేషన్ నామ్చికి దగ్గర. జల్పైగురి వద్ద న్యూ జల్పైగురి, జల్పైగురి, జల్పైగురి రోడ్ అనే మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా నామ్చి కి బాగ్డోగ్రా సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 May,Fri
Return On
28 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 May,Fri
Check Out
28 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 May,Fri
Return On
28 May,Sat