ప్రపంచం లోని తేయాకు ప్రేమికుల్లో “టేమీ టీ” బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని సిక్కిం లోని టేమీ తేయాకు తోటల్లో పెంచుతారు, ఇక్కడి తేయాకు తోట ఇదొక్కటే. బహుశా ప్రపంచం లోని ఉత్తమ తేయాకు తోటల్లో ఒకటి ఇది.టేమీ తేయాకు తోటను 1969 లో సిక్కిం ప్రభుత్వం స్థాపించింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే అత్యుత్తమ టీ ని “టేమీ టీ” అంటారు, తరువాతి రకాలు వరుసగా సిక్కిం సోల్జా, మిస్టిక్, కాంచేన్ జంగా రకాలు.
ఈ తేయాకు తోట సంప్రదాయ పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో తేయాకు ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల ఈ తోటను సేంద్రియ తోట గా కూడా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే పూర్తవడం వల్ల ఈ తోట నుంచి సేంద్రియ టీ ని కొద్ది పరిమాణాల్లో కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఆసక్తి కరంగా, టేమీ టీ కి కోల్కతా టీ వేలం లో అత్యధిక ధర పలికింది. మీరు తేయాకు ప్రేమికులైతే, ఇక్కడికి తప్పకుండా వెళ్ళాలి.