అతి పెద్ద గ్రామాలలో చైన్పూర్ ఒకటే కాక, పండుగ సంబరాల సమాహారం కూడ. కాళీ పూజ, హోలీ, దుర్గాపూజ చైన్పూర్ లోని ప్రధాన పండుగలు. వీటితో బాటుగా, జన్మాష్టమి, శివరాత్రి, హనుమాన్ జయంతి, సమ చకేవ, ఛత్, చౌర్చనారే కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలతో బాటుగా దాని విలక్షణ నిర్మాణ శైలికి పేరొందిన “నీలకంఠ మందిర్” అనే శివాలయం కూడా ఉంది. ఇతర ప్రసిద్ధ ఆలయాలలో కాళీ మందిరం. దుర్గ మందిరం, విష్ణు మందిరం, రాధాకృష్ణ కుటీరం, బ్రహ్మ బాబాస్థానం ఉన్నాయి. ప్రతి ఏటా, కాళీ పూజ సందర్భంగా ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంది.