బ్రహ్మ, మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తి లోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన పురాణ గాధల తో అనుబంధం వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. హిందూ పురాణాల ప్రకారం, కొన్ని పాపాల వల్ల తన సృజన శక్తిని బ్రహ్మ దేవుడు ఈ గుడి వున్న చోట శివుడి గురించి తీవ్ర తపస్సు చేసాడు. శివుడి దయ వల్ల సృష్టి కార్యక్రమం తిరిగి ప్రారంబించాడు.
ఈ గుడిలో శివలింగం నాలుగు దిక్కులూ చూసే నాలుగు ముఖాలతో వుండడం విశేషం.చతుర్ముఖుడు అంటే నాలు ముఖాలున్న వాడని అర్ధం. ఈ దేవాలయం గొప్పతనం వల్ల ప్రతి ఏటా ఈ స్వామి ఆశీస్సుల కోసం ఎంతో మంది శైవులు ఇక్కడికి వస్తుంటారు. గుడి గోడల మీద శివుడికి చెందిన పురాణ గాధల చిత్రాలు వున్నాయి.