కాళహస్తి దేవాలయం పేరుకు తగ్గట్టే ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాళహస్తి పట్టణంలో వుంది. శివుడి ప్రధాన దేవాలయాల్లో ఇది ఒకటి. తిరుపతి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం లో పంచభూతాల్లో ఒకటైన వాయువు అనే భూతానికి ప్రాతినిధ్యం వహించే శివలింగం వున్న దేవాలయం వుంది. ఈ గుడిలోని శివలింగాన్ని కాళహస్తీశ్వరుడిగా కొలుస్తారు.
పురాణ గాధల ప్రకారం తనను పరీక్షించిన శివుడి కోసం తన కంటినే తీసి ఇచ్చిన పరమ భక్తుడు భక్త కన్నప్ప ఇక్కడే శివుడిని కొలిచాడు. పరమశివుడు అతనికి ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ గుడిని రెండు భాగాలుగా నిర్మించారు – లోపలి భాగం 5వ శతాబ్దంలో నిర్మించగా, బయటి భాగాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. బయటి భాగాన్ని చోళ రాజులు చోళ నిర్మాణ శైలిలో నిర్మించారు.
శివభక్తులే కాక తమ జాతకాల్లో రాహు, కేతు దోషాల నుంచి ప్రత్యెక పూజల ద్వారా విముక్తి పొందడానికి కూడా ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి సందర్శించేవారు కాళహస్తి లోని కాళహస్తీశ్వర దేవాలయాన్ని కూడా దర్శిస్తారు.



Click it and Unblock the Notifications