కన్యాకుమారి టెంపుల్, కన్యాకుమారి

హోమ్ » ప్రదేశములు » కన్యాకుమారి » ఆకర్షణలు » కన్యాకుమారి టెంపుల్

కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. ఈ దేవత పార్వతి అవతారం. కుమారి దేవత శివుడిని వివాహం చేసుకునేటందుకు స్వంత శిక్ష అనుభవిస్తుంది. కన్య కుమారి అనే పేరు , కన్య - కుమారి అని రెండు పదాల నుండి ఏర్పడింది. కన్య అంటే 'పవిత్రమైనది ' అని మరియు కుమారి అంటే 'బాలిక' అని చెపుతారు. గాధల మేరకు, శివుడి కి , కన్యాకుమారి కి మధ్య వివాహం జరుగ లేదు. కనుక కన్యాకుమారి తాను కన్యగా ఉండేందుకు నిర్ణయం చేసుకుంది. వివాహం కొరకు సమకూర్చిన ధాన్యం వండకుండా మిగిలి పోయి అది రాలు గా మార్పు చెందాయి. ఇపుడు పర్యాటకులు గింజలు గా కనపడే రాలను వాటి గుర్తుగా కొనుగోలు చేస్తారు.

ఈ టెంపుల్ ను పాండ్య రాజులు ఎనిమిదవ శతాబ్దం లో నిర్మించారు వారి తర్వాత ఈ టెంపుల్ ను విజయనగర్, చోళ మరియు నాయక రాజులు పునరుద్ధ రించారు. కన్యాకుమారి టెంపుల్ లో నేటికి 18 వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాద ముద్రలు చూడవచ్చు.

Please Wait while comments are loading...