ఖొడాల వద్ద నిర్వహించే మౌంటెన్ రేంజ్ వైల్డ్ కేంప్ ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ. ఈ కేంప్ సుమారు 15 ఎకరాలలో నిర్వహిస్తారు. ఈ కేంప్ లో కొత్త వారికి మరియు అనుభవంకలవారికి సహ్యాద్రి కొండల అందమైన అడవులలో తిరిగేందుకు ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. ట్రెక్కింగ్ మాత్రమేకాక, దట్టమైన అడవులలో, ఉత్సాహాన్నిచ్చే జీపు సఫారీలు, జలపాతాలపైకి తాళ్ళతో అధిరోహించటం, మౌంటెన్ బైకింగ్ వంటి క్రీడలు సైతం ఇక్కడ కలవు. అటవీ బాటల ట్రెక్కింగ్ కు పర్వతారోహణకు తగిన ప్రోత్సాహం కొరకు మౌంటెన్ రేంజ్ వైల్డ్ కేంప్ మంచి కేంద్ర స్ధానంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications