కొడంగలూర్ సమీపంలోనే గల కూడళ్ మాణిక్యం ఆలయం కేరళలో అత్యంత సందర్శించబడే గుళ్ళలో ఒకటి. ఇది త్రిస్సూర్ కి సుమారు 20 కి.మీ ల దూరంలో ఉన్న ఇరింగలకుడ లో ఉంది. శ్రీ రాముని సోదరుడైన భరతునికి అంకితం చేయబడిన ఏకైక భారతీయ దేవాలయం కావటంవల్ల, దేశం నలు చెరగుల నించి భక్తుల విశేషంగా ఇక్కడి తరలివస్తారు.నిర్మాణ శోభకి , హస్తకళా నైపుణ్యానికి ఈ గుడి పెట్టింది పేరు. ఈ ఆలయ ప్రాంగణంలో గుండ్రని గర్భ గుడి, ఒక చుట్టంబలం, లోపలి గోడల పైన అత్యద్భుతమైన కుడ్యచిత్రాలు (మ్యూరల్స్) , నాలుగు కోనేళ్ళు ఉన్నాయి. గుడి ప్రహరీ ని ఆనుకుని కథాకళి, కూతు లాంటి సాంప్రదాయ ఆలయ కళలు ప్రదర్శించబడే కూతంబలం ఉన్నది. ప్రతి ఏడాది ఏప్రిల్-మే నెలలలోని పది రోజుల పాటు ప్రధాన వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవ సమయంలో అలంకరించబడ్డ ఏనుగులు , పంచరి మేళం (పవిత్ర సంగీతం) తో కూడిన భారీ ఊరేగింపు చూపరులకి కన్నుల పండుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications