త్రిప్రయార్ నదీ పారివాహిక ప్రాంతంలో గల త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం కొడంగలూర్ లోని ముఖ్య ధార్మిక ప్రదేశాల్లో ఒకటి. ఇది కొడంగలూర్ కి 26 కి.మీ ల దూరంలో ఉన్న త్రిప్రయార్ లో ఉంది. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమైన శ్రీ రాముడు ఇక్కకి ఆలయ వేల్పు.ఈ చిన్న సుందరమైన మందిరానికి చుట్టూ ఎన్నెన్నో పురాణాలు గాథలు అల్లుకున్నాయి. పురాణానుసారం, ఈ గుళ్ళో ప్రతిష్టించబడిన విగ్రహం స్థానిక నాయకుడికి సముద్ర తీరంలో దొరికింది. ఈ మూర్తి లో బ్రహ్మదేవుని, మహావిష్ణువుని, పరమశివుని అంశలు కలిసి ఉండుటు చేత త్రిమూర్తి గా పూజింపబడుతుంది.
అరట్టుపుళ పూరం వేడుకలలో ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల మరింత పేరు వచ్చింది. ఆలయ ప్రాంగణంలో గర్భగుడి, రామాయణ ఘట్టాలు, కలప తో చెక్కిన నవగ్రహాలు, పురాతన కుడ్య చిత్రాలు (మ్యూరల్స్) గల నమస్కార మండపం ఉన్నాయి. త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం లో కూతు (నాటకం) లాంటి సాంప్రదాయ కళా రూపాల ప్రదర్శనలు తరచూ జరుగుతూ ఉంటాయి.



Click it and Unblock the Notifications