పర్యటనకు మార్చ్ - మే నెలలు అనుకూలం
వేసవి కొహిమా లో వేసవి మార్చ్ నుండి మే నెల వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల కు మించని కారణంగా అనేక మంది టూరిస్టులు ఈ కాలం లో సందర్శిస్తారు.
వర్షాకాలం కొహిమా లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికం. సగటు వర్షపాతం ప్రతి నేలా 300 మీ. మీ. లుగా వుంటుంది. సుందరమైన ఈ పట్టణాన్ని మరింత అందంగా చేస్తుంది. ఈ కాలం లో పర్యటన బాగుంటుంది.
వింటర్ కోహిమాలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. చలి తీవ్రత అధికం. కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా వుంది అపుడపుడూ వర్షం కూడా పడుతుంది. ఈ సమయంలోనే ప్రతి ఏటా చేసే హార్న్ బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.