Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలార్ » వాతావరణం

కోలార్ వాతావరణం

ఉత్తమ సమయం : వాతావరణం లో తేమ తక్కువగా వుంది, ఆహ్లాదకర వాతావరణం ఉండడం వల్ల ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు కోలార్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం.

వేసవి

వేసవి : (మార్చ్ నుంచి మే) : కొలార్లో వేసవి చాలా వేడిగా, తేమగా అసౌకర్యంగా వుంటుంది. పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల దాకా వుంటుంది – రాత్రిళ్ళు కూడా 30 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఈ వేడి, తేమ వల్ల యాత్రికులు వేసవి లో ఇక్కడికి రావడానికి ఇష్టపడరు.  

వర్షాకాలం

వర్షాకాలం : (అక్టోబర్ నుంచి డిసెంబర్) : ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతం ప్రభావితం అవుతుంది – దీనివల్ల ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. యాత్రికులు ఈ కాలం లో కూడా ఇక్కడికి రారు.    

చలికాలం

శీతాకాలం : (డిసెంబర్ నుంచి ఫిబ్రవరి) : శీతాకాలం లో ఇక్కడి వాతావరణం మామూలుగాను, ఆహ్లాదకరంగాను వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 దిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు గాను వుంటుంది. వాతావరణం సౌకర్యంగా తక్కువ తేమతో వుండడం వల్ల కోలార్ ను సందర్శించడానికి శీతాకాలం అనువైన సమయం.