లోనార్ లోని దైత్య సూదన దేవాలయం ఖజురహో దేవాలయం లాగానే నిర్మించారు.బలమైన చాళుక్య రాజుల పాలన క్రింద వున్నప్పుడు, 6 నుంచి 12 శతాబ్దాల మధ్య ఈ గుడి విష్ణువు కోసం కట్టారు. ఈ గుడి నిర్మాణం హేమాద్ పతి శైలిలో అసమంగా, కొలతల్లెకుండా వుండే నక్షత్రంలా వుంటుంది.ఈ పుణ్య క్షేత్రం గోడల మీద అందమైన శిల్పాలు చెక్కి వున్నాయి. ఈ విగ్రహమే ఒక లోహంతో చేయబడి, రాతితో చెక్కిన దానిలా కనపడుతుంది. ఈ కట్టడం చాలా చీకటిగా వుండడం వల్ల ఆ గోడల మీది శిల్పాలు టార్చ్ లైట్ వెలుతురూ లోనే కనపడతాయి.ఈ గుడి వేదిక 1.5 మీటర్ల ఎత్తున వుండగా, పూర్తీ కాని పై కప్పు పిరమిడ్ లాంటి నిర్మాణ చేయాలన్న సంకల్పం పూర్తీ కాలేదని సూచిస్తుంది. బయటి గోడల మీద కూడా ఆనాటి చరిత్రను చూపించే శిల్పాలు వున్నాయి.



Click it and Unblock the Notifications