మల్షేజ్ ఘాట్ – ఎలా చేరుకోవాలి వాయుమార్గం 150 కిలోమీటర్ల దూరంలోని ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి దగ్గర. ఇక్కడి నుంచి దేశంలోనూ, విదేశాలలోనూ వున్న అన్ని ప్రధాన నగరాలకు నిత్యం విమాన సేవలు అందుబాటులో వున్నాయి. ముంబై విమానాశ్రయం సింగపూర్, న్యూ యార్క్ లాంటి నగరాలకు కలపబడి వుండడం వల్ల విదేశాల నుంచి వచ్చే వారికి చాలా సౌకర్యంగా వుంటుంది. ఇక్కడి నుంచి మల్షేజ్ ఘాట్ వెళ్ళడానికి విమానాశ్రయం బయట నుంచి సుమారు 3000 రూపాయల చార్జీ తో టాక్సీలు దొరుకుతాయి. నాశిక్ లోని గాంధీనగర్, పూణే లోని లోహేగావ్ దేశీయ విమానాశ్రయాలు ఇక్కడికి దగ్గరలోనే వున్నాయి.